![]() |
- 60 ఏళ్ల సుదీర్ఘమైన కెరీర్
- నిర్మాతగా 90 సినిమాలు, దర్శకుడిగా 55 సినిమాలు
- భారతీయ సినిమాకు ఆద్యుడు
భారతీయ చిత్ర పరిశ్రమలో వి.శాంతారాం ఓ శకంగా పేర్కొనవచ్చు. ఎంతో మంది నటీనటులు, దర్శకనిర్మాతలు ఆయన్ని ఆద్యుడిగా భావిస్తారు. 60 సంవత్సరాలకుపైగా చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలందించిన శాంతారాం జీవితం ఎందరికో ఆదర్శం. తన కెరీర్‌లో 90 సినిమాలు నిర్మించి, 55 సినిమాలకు దర్శకత్వం వహించిన లెజెండ్ శాంతారాం. రaనక్ రaనక్ పాయల్ బాజే, దో ఆంఖే బారా హాత్ వంటి కళాఖండాలను ఆయన రూపొందించారు. చిత్ర పరిశ్రమకు ఆయన సేవలకుగాను పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇవి కాక ఆయన అందుకున్న పురస్కారాలు, సత్కారాలకు లెక్క లేదు.
Also Read: ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఈ రోజే.. అభిమానుల్లో జోష్
భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన శాంతారాం జీవితంగా ఆధారంగా ‘వి.శాంతారాం’(ది రెబల్ ఆఫ్ ఇండియన్ సినిమా) పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. అభిజీత్ శిరీష్ దేశ్‌పాండే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శాంతారాం పాత్రను సిద్ధాంత్ చతుర్వేది పోషిస్తున్నారు. శాంతారాంకు ముగ్గురు భార్యలు. విమలాబాయి, జయశ్రీ, సంధ్య. జయశ్రీ నటి కూడా. సినిమాలో ఎంతో కీలకంగా ఉండే జయశ్రీ పాత్రను తమన్నా పోషిస్తున్నారు. ఒక లెజండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ బయోపిక్‌లో తమన్నాకి అవకాశం దక్కడం నిజంగా ఆమె అదృష్టం అంటున్నారు.
Also Read: అఖండ 2 ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా పడిన కొత్త చిత్రాలు
తాజాగా శాంతారాం బయోపిక్‌కి సంబంధించి తమన్నా క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. సంప్రదాయ చీరకట్టులో, గౌరవప్రదంగా కనిపిస్తున్న తమన్నా లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన పాత్ర అని చెప్పాలి. ఇంతకుముందెన్నడూ ఇలాంటి క్యారెక్టర్ తమన్నా చెయ్యలేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తోనే సాగే శాంతారాం బయోపిక్‌ను ఓ స్పెషల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు అభిజీత్. తాజాగా విడుదలైన తమన్నా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![]() |